రోజుకు రూ.7,700 కోట్లు.. ఏడాదిలో మస్క్‌ సంపదలో భారీ పెరుగుదల!

10-08-2026 Mon 15:28 | Business
Advertisement
  • ఏడాదిలో 320 బిలియన్‌ డాలర్లు పెరిగిన మస్క్‌ సంపద
  • రోజుకు సగటున 875 మిలియన్‌ డాలర్లు పెరిగిన వైనం
  • 107.6 బిలియన్‌ డాలర్లు పెరిగిన మైఖేల్‌ డెల్‌ సంపద 
  • డీప్‌సీక్‌ అధినేత సంపదలో 3,850 శాతం పెరుగుదల
  • టాప్‌ 50 కుబేరుల్లో చేరిన లియాంగ్‌ వెన్‌ఫెంగ్‌
  • 2021లో తొలిసారి ఫోర్బ్స్‌ జాబితాలో చోటు సంపాదించిన మస్క్‌
Advertisement
ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ సంపద ఏడాది కాలంలో భారీగా పెరిగింది. 2025 జులై నుంచి 2026 జులై మధ్య ఆయన సంపద ఏకంగా 320 బిలియన్‌ డాలర్లు పెరిగింది. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.27 లక్షల కోట్లకు పైగా. రోజుకు సగటున 875 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.7,700 కోట్లు) చొప్పున ఆయన సంపద పెరిగినట్లు బెస్ట్‌బ్రోకర్స్‌ విశ్లేషణ వెల్లడించింది.

ఫోర్బ్స్‌ రియల్‌టైమ్‌ బిలియనీర్‌ జాబితాను ఆధారంగా చేసుకుని ఈ విశ్లేషణ చేశారు. 2025 జులై 27న, 2026 జులై 27న ప్రపంచ కుబేరుల సంపదను పోల్చి చూశారు. గత ఏడాది కృత్రిమ మేధ, టెక్నాలజీ రంగాల్లో భారీ వృద్ధి కనిపించింది. దీంతో ఈ రంగాలకు చెందిన పలువురు వ్యాపారవేత్తల సంపద గణనీయంగా పెరిగింది.

మస్క్‌ తర్వాత అత్యధికంగా సంపద పెరిగిన వ్యక్తిగా డెల్‌ టెక్నాలజీస్‌ వ్యవస్థాపకుడు మైఖేల్‌ డెల్‌ నిలిచారు. ఆయన సంపద ఏడాదిలో 107.6 బిలియన్‌ డాలర్లు పెరిగింది. డీప్‌సీక్‌ వ్యవస్థాపకుడు లియాంగ్‌ వెన్‌ఫెంగ్‌ సంపద 2025లో 1 బిలియన్‌ డాలర్ల నుంచి 2026లో 39.5 బిలియన్‌ డాలర్లకు చేరింది. అంటే ఏడాదిలో ఏకంగా 3,850 శాతం పెరిగింది. దీంతో ఆయన ప్రపంచంలోని టాప్‌-50 కుబేరుల జాబితాలో చేరారు.

మస్క్‌ తొలిసారి 2021లో ఫోర్బ్స్‌ కుబేరుల జాబితాలో చోటు సంపాదించారు. అప్పటి నుంచి ఆయన సంపద కొత్త రికార్డులు సృష్టిస్తూనే ఉంది. దక్షిణాఫ్రికాలో జన్మించిన మస్క్‌ 18 ఏళ్లలోపు కెనడాకు వెళ్లారు. అనంతరం అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీలో ఆర్థికశాస్త్రం చదివారు.

ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సంస్థ విలీనంతో మస్క్‌ తొలి బిలియన్‌ డాలర్ల సంపదను సంపాదించారు. ఆయన సహ వ్యవస్థాపకుడిగా ఉన్న ఆ సంస్థ పీటర్‌ థీల్‌ సహ-వ్యవస్థాపకుడిగా ఉన్న పేపాల్‌తో విలీనమైంది. ఆ తర్వాత ఈ సంస్థను ఈబే 1.4 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసింది.
Advertisement
Elon MuskElon Musk Net Worth 2026Forbes Billionaires ListMichael DellDeepSeek Liang WenfengTech Wealth Growth

More Telugu News

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21
..more